23 June 2022

Samethalu In Telugu With Images Telugu Samethalu Lyrics Samethalu Pdf Collection

Samethalu In Telugu with images,Telugu Samethalu hd images, Samethalu collection,Telugu Samethalu In Telugu with image starting with A,Telugu Samethalu hd images,telugu quotations hd wallpapers,Telugu Samethalu in telugu,Telugu Samethalu telugu suktulu,Telugu Samethalu In Telugu with images,Bommalatho telugu Saamethalu,sarada samethalu,Telugu proverbs with pictures,telugu samethalu images whatsapp,telugu samethalu images with meaning,simple telugu samethalu,telugu samethalu with meanings,50 telugu samethalu,telugu samethalu questions and answers,telugu samethalu,telugu samethalu kanipettandi
Samethalu In Telugu with images,Telugu Samethalu hd images, Samethalu collection,Telugu Samethalu In Telugu with image starting with A,Telugu Samethalu hd images,telugu quotations hd wallpapers,Telugu Samethalu in telugu,Telugu Samethalu telugu suktulu,Telugu Samethalu In Telugu with images,Bommalatho telugu Saamethalu,sarada samethalu,Telugu proverbs with pictures,telugu samethalu images whatsapp,telugu samethalu images with meaning,simple telugu samethalu,telugu samethalu with meanings,50 telugu samethalu,telugu samethalu questions and answers,telugu samethalu,telugu samethalu kanipettandi     

సామెతలు అంటే ఏవి ?

"లోకోక్తిముక్తావళి" అనే సంకలనం ఉపోద్ఘాతంలో రచయిత సామెతను ఇలా నిర్వచించాడు

సంస్కృతములో "లోకోక్తులు" "న్యాయములు" అనేవాటినే తెలుగులో "సామెతలు" అంటారు. లోకోక్తి అంటే విశేష లోకానుభవము గల పెద్దల మాట. ఇవి తక్కువ పదాలలో విశేషార్ధము కలిగి ఉంటాయి.
ఇవి దేశీయ పద సమ్మిళితములైయుండి జనుల ఆచారములను, నాగరికతను, మనోభావమును ప్రకటించుచుండును. వీటిని చదివినా విన్నా గాని నీతిబోధకములుగా ఉండి ప్రాపంచిక జ్ఞానమును వృద్ధిపరచి, ఆనందదాయకముగా ఉండును. Eric Pertridge అనే ఆంగ్ల రచయిత ఇలా చెప్పాడు - "In the potted wisdom of the world's proverb literature, there is shrewdness, Commonsense, good sense and at times we ftnd at times a penetrating profundity, humour and wit beneficient satire and expedient salvation."

ప్రజా బాహుళ్యంలో ఎక్కువగా ప్రచారంలో ఉండి, మరల మరల వాడబడే వాక్యాలు లేదా పదజాలాలు సామెతలు అవుతాయి. ఇవి సాధారణంగా సరళమైన భాషలో ఉంటాయి. ఎక్కువ మందికి తెలిసి ఉంటాయి (అంటే సామెత చెప్పిన వ్యక్తి దాని అర్ధాన్ని వివరించనక్కరలేదు). అనుభవాత్మకంగా గాని, సామాన్య జ్ఞానంతో గాని తెలిసిన విషయం సామెతలో కొన్నిమార్లు సూటిగాను, కొన్నిమార్లు అన్యాపదేశంగాను, కొన్నిమార్లు సోదాహరణంగాను చెప్పబడుతుంది. పదాల కూర్పులో పొందిక గాని లయ గాని ఉండడం కద్దు. సామెత ప్రధానంగా సూటిగా నీతిని బోధించేదయితే దానిని "సూక్తి" లేదా "నీతి వాక్యము" అంటారు. మరీ చిన్నవైన వాక్యాలు (రెండు మూడు పదాలు మాత్రమే) ఉంటే అది "జాతీయము" కూడా కావచ్చును.

  "లోకోక్తి" పదాన్ని తెలుగులో "నానుడి" అని, తమిళంలో "పళమొళి", పంళచొళ్ళు" అని, కన్నడంలో "నాన్నుది" అని అంటారు. ఇవన్నీ "జనుల మాట" అన్న అర్ధాన్నే ఇస్తాయి. కనుక సామెతలు అంటే "పదుగురాడు మాట", "జనుల నోట నానిన మాట" అని చెప్పవచ్చును.

   సామెతల వినియోగం సందర్భానుసారంగా వివిధ ఫలితాలనిస్తుంది. ఒకోమారు కటువైన విషయాన్ని సామెతల ద్వారా మెత్తగా చెప్పవచ్చును. ఒకోమారు ఒక వ్యక్తి తన బలహీనమైన వాదానికి తరతరాల అనుభవాన్ని జోడించిన బలం పొందగలుగుతాడు. ఒకోమారు సంభాషణకు కాస్త చైతన్యం లభిస్తుంది. ఉపన్యాసకులు సామెతల ద్వారా తమ ప్రసంగాన్ని రక్తికట్టించగలుగుతారు. సామెతల అధ్యయనం అనేక ప్రయోజనాలకు వాడుతారు - జానపద సాహిత్యం అధ్యయనం చేసేవారికి ఇది చాలా ఆసక్తిదాయకమైన అంశం. ప్రజల నాగరికతలో వచ్చిన మార్పులు, వలస వెళ్ళినవారు క్రొత్త సమాజంలో ఇమిడిన తీరు, ప్రకటనలలో ఆకర్షణ, పాఠ్యాంశాల బోధనలో మెళకువలు - ఇలా అనేక ప్రయోజనాలున్నాయి.
    సామెతలు అధికంగా ప్రజల జీవనం నుండి, అనుభవంనుండి పుడతాయి. కాని సాహిత్యంనుండి, మత గ్రంథాల నుండి, రాజకీయ నేపథ్యంనుండి కూడా పుట్టవచ్చును. కొన్ని తెలుగు సినిమా పేలిన డైలాగులు కూడా తెలుగులో సామెతలకు సమాన స్థాయిని సాధించి చలామణిలో ఉన్నాయి ("సాహసము సేయుమురా డింభకా", "మడిసన్నాక కుసంత కలాపోసనుండాలి. తిని తొంగింటే మడిసికీ గొడ్డుకూ తేడా యేటుంటుంది?", "ఒకసారి కమిటయ్యాక నా మాట నేనే వినను") 

తెలుగు సామెతలు (Best Telugu Proverbs):

సామెతలు లేదా లోకోక్తులు అని పల్లెలోని ప్రజలు ఎక్కవుగా వాడుతూ ఉంటారు. “సామెతలు” ప్రజల అనుభవాల నుండి పుట్టుకొస్తాయి. వీటికి రచయితలు అంటూ ఎవరు ఉండరు. వీటిని అప్పుడు జరుగుతున్న ఒక సంఘటనని, సన్నివేశాన్ని పోల్చుతూ సరదాగా, హాస్యభరితంగా చెప్పడానికి ఈ సామెతలను వాడతారు. అలాంటి కొన్ని సామెతలను ఇప్పుడు తెలుసుకుందాం.


  • కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
  •  
  • అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటుందన్నాడట!
  •  
  • అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవళికి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట!
  •  
  • మొహమాటానికి పోయి ముండ కడుపు తెచ్చుకుందట
  •  
  • సిగ్గు లేని వాడికి నవ్వే సింగారం
  •  
  • ఆవలింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు!
  •  
  • అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట

  • మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా ఉంటుందా?

  • అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందట!
  •  
  • నిద్రపోయే వాడిని నిద్ర లేపొచ్చు కానీ; నిద్ర పోయినట్టు నటించేవాడిని నిద్ర లేపలేం 

  • పొమ్మనలేక పొగ పెట్టినట్లు

  • పోన్లే పాపమని పాత బట్ట ఇస్తే; గుడి వెనక పోయి ఉరి వేసుకుందట

  • పేనుకు పెత్తనం ఇస్తే తల అంత గొరికి పెట్టిందంట.

  • తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగిన అది కళ్ళే అనుకుంటారు

  • అందని ద్రాక్షలు పుల్లన

  • అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు
  •  
  • ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం
  •  
  • కుక్క కాటుకి చెప్పు దెబ్బ 

  • ఆలస్యం అమృతం విషం
  •  
  • పరిగెత్తి పాలు తాగడం కంటే నిల్చుని నీళ్ళు తాగటం మేలు

  • చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు

  • తంతే గారెల బుట్టలో పడ్డాడుట!

  • కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట!

  • ఆస్తి మూరెడు ఆశ బారెడు!
  •  
  • పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం
  •  
  • మింగటానికి మెతుకు లేదు కాని మీసానికి సంపెంగ నూనె
  •  
  • పొరుగింటి పుల్ల కూర రుచి 

  • అందితే జుట్టు అందక పోతే కాలు
  •  
  • ఇల్లలకగానే పండగ కాదు
  •  
  • ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరగక చెడతాడు
  •  
  • ఊళ్ళో పెళ్ళి కి కుక్కల హడావిడి
  •  
  • అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
  •  
  • ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
  •  
  • ఇల్లు పీకి పందిరేసినట్టు
  •  
  • చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
  •  
  • కందకు లేని దురద కత్తిపీటకెందుకు

  • నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు
  •  
  • పిట్ట కొంచెం కూత ఘనం
  •  
  • ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ
  •  
  • ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
  •  
  • ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
  •  
  • కుసే గాడిద వచ్చి మెసే గాడిదను చెడగొట్టిందంట
  •  
  • సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు
  •  
  • ఇళ్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పు అడిగాడట
  •  
  • నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
  •  
  • మెరిసేదంతా బంగారం కాదు
  •  
  • ఉన్న లోభి కంటే లేని దాత నయం
  •  
  • కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
  •  
  • కలలోని కౌగిలికి కడుపు లొస్తాయా? 

  • కాలితో నడిస్తే కాశీకి పోవచ్చునుగాని, తలతో నడిస్తే తనవాకిలి దాటవచ్చునా
  •  
  • కింద పడినా, మీసాలకు మన్ను కాలేదన్నట్లు
  •  
  • కుట్టే వాడికి కుడివైపు, చీదే వాడికి ఎడమవైపు ఉండకూడదు
  •  
  • కూతురు కనలేకపోతే, అల్లుడి మీద పడి ఏడ్చినట్లు.
  •  
  • కొండ నాలికను మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టు
  •  
  • కోళ్లను తింటారా అంటే బొచ్చు పారేస్తాము అన్నట్లు
  •  
  • గంధం సమర్పయామి అంటే గొడ్డలి నూరరా అన్నాడట
  •  
  • గాలికిపోయిన పేలపిండి భగవదర్పితమన్నట్లు
  •  
  • చస్తానని చద్దన్నం తింటే చల్లగా నిద్రవచ్చిందంట 

  • చాదస్తపు మొగుడు చెపితే వినడు, చెప్పకుంటే కరుస్తాడు
  •  
  • చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద
  •  
  • చుట్టురా శ్రీ వైష్ణవులే చూస్తే కల్లు కుండ లేదు
  •  
  • చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు
  •  
  • గాజుల చెయ్యి గలగలలాడితే ఇల్లు కళకళలాడుతుంది.
  •  
  • గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛపోయిందట
  •  
  • అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
  • అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
  • అతి రహస్యం బట్టబయలు
  • అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
  • అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
  • అనువు గాని చోట అధికులమనరాదు
  • అభ్యాసం కూసు విద్య
  • అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
  • అయితే ఆదివారం కాకుంటే సోమవారం
  • ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
  • ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
  • ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు    
  • ఇంట గెలిచి రచ్చ గెలువు
  • ఇల్లు పీకి పందిరేసినట్టు
  • ఎనుబోతు మీద వాన కురిసినట్టు
  • చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
  • కందకు లేని దురద కత్తిపీటకెందుకు
  • కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు 
  • కుక్క కాటుకు చెప్పుదెబ్బ
  • కోటి విద్యలు కూటి కొరకే
  • నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
  • పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
  • పిట్ట కొంచెము కూత ఘనము 
  • రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

  • వాన రాకడ ప్రాణపోకడ
  • కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
  • మీసాలకు సంపంగి నూనె
  •  ఆ మొద్దు లొదే ఈ పేడు
  •  ఆ తాను ముక్కే !!!
  •  ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
  •  ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
  •  ఆది లొనే హంస పాదు
  •  ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
  •  ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు
  •  ఆకాశానికి హద్దే లేదు
  •  ఆలస్యం అమృతం విషం
  •  ఆరే దీపానికి వెలుగు యెక్కువ
  •  ఆరోగ్యమే మహాభాగ్యము
  •  ఆత్రానికి బుద్ధి మట్టు
  •  ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట
  •  ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?
  •  అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
  •  అడగందే అమ్మైనా అన్నమ్ పెట్టదు
  •  అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు
  •  ఏ ఎండకు ఆ గొడుగు
  •  అగడ్తలొ పడ్డ పిల్లికి అదే వైకున్ఠం
  •  అగ్నికి వాయువు తొడైనట్లు
  •  ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు
  •  అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట
  •  అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
  •  అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
  •  అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేధు
  •  అప్పు చేసి పప్పు కూడు
  •  అయ్య వచే వరకు అమావాస్య ఆగుతుందా 
  •  అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
  •  బతికుంటే బలుసాకు తినవచ్చు
  •  బెల్లం కొట్టిన రాయిలా
  •  భక్తి లేని పూజ పత్రి చేటు
  •  బూడిదలో పోసిన పన్నీరు
  •  చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు
  •  చాప కింద నీరులా
  •  చచ్చినవాని కండ్లు చారెడు
  •  చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
  •  విద్య లేని వాడు వింత పశువు
  •  చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
  •  చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
  •  చక్కనమ్మ చిక్కినా అందమే
  •  చెడపకురా చెడేవు
  •  చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు
  •  చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ
  •  చింత చచ్చినా పులుపు చావ లేదు
  •  చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
  •  చిలికి చిలికి గాలివాన అయినట్లు
  •  డబ్బుకు లోకం దాసోహం
  •  దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
  •  దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
  •  దాసుని తప్పు దండంతో సరి
  •  దెయ్యాలు వేదాలు పలికినట్లు
  •  దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
  •  దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
  •  దొంగకు తేలు కుట్టినట్లు
  •  దూరపు కొండలు నునుపు
  •  దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
  •  దురాశ దుఃఖమునకు చెటు
  •  ఈతకు మించిన లోతే లేదు
  •  ఎవరికి వారే యమునా తీరే
  •  ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
  •  గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
  •  గాజుల బేరం భోజనానికి సరి
  •  గంతకు తగ్గ బొంత
  •  గతి లేనమ్మకు గంజే పానకము
  •  గోరు చుట్టు మీద రోకలి పోటు
  •  గొంతెమ్మ కోరికలు
  •  గుడ్డి కన్నా మెల్ల మేలు
  •  గుడ్డి యెద్దు జొన్న చేలో పడినట్లు
  •  గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
  •  గుడి  మింగే వాడికి నంది పిండీమిరియం
  •  గుడినీ గుడిలో లింగాన్నీ మింగినట్లు
  •  గుడ్ల మీద కోడిపెట్ట వలే
  •  గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట 
  •  గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
  •  గురువుకు పంగనామాలు పెట్టినట్లు
  • తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
  •  ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
  •  ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు 
  •  ఇంటికన్న గుడి పదిలం
  •  ఇసుక తక్కెడ పేడ తక్కెడ
  •  జోగి జోగి రాజుకుంటే బూడిద రాలిందంట
  •  కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
  •  కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
  •  కాకి ముక్కుకు దొండ పండు
  •  కాకి పిల్ల కాకికి ముద్దు
  •  కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
  •  కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
  •  కాసుంటే మార్గముంటుంది
  •  కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
  •  కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును
  •  కలిమి లేములు కావడి  కుండలు
  •  కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుదతాదు
  •  కంచే చేను మేసినట్లు
  •  కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా!
  •  కందకు కత్తి పీట లోకువ
  •  కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
  •  కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
  •  కీడెంచి మేలెంచమన్నారు
  •  కొండ  నాలికకి మందు  వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
  •  కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
  •  కొండను తవ్వి యెలుకను పట్టినట్లు
  •  కొన్న దగ్గిర కొసరు గాని కోరిన దగ్గర కొసరా
  •  కూసే గాడిద వచ్చి  మేసే గాడిదను చెరిచిందిట
  •  కూటికి పేదైతే కులానికి పేదా
  •  కొరివితో తల గోక్కున్నట్లు
  •  కోతి పుండు బ్రహ్మాండం
  •  కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
  •  కొత్తొక వింత పాతొక రోత
  •  కోతి విద్యలు కూటి కొరకే 
  •  కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
  •  కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
  •  కృషితో నాస్తి దుర్భిక్షం
  •  క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
  •  కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
  •  కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
  •  లేని దాత కంటే ఉన్న లోభి నయం
  •  లోగుట్టు పెరుమాళ్ళకెరుక
  •  మెరిసేదంతా బంగారం కాదు
  •  మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో 
  •  నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది 
  •  మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
  •  మనిషి మర్మము మాను చేవ బయటకు తెలియవు
  •  మనిషి పేద అయితే మాటకు పేదా
  •  మనిషికి మాటే అలంకారం
  •  మనిషికొక మాట పశువుకొక దెబ్బ
  •  మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
  •  మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
  •  మీ బోడి సంపాదనకు ఇద్దరు పెళ్ళాలా 
  •  మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
  •  మొక్కై వంగనిది మానై వంగునా
  •  మొరిగే కుక్క కరవదు
  •  మొసేవానికి తెలుసు కావడి బరువు
  •  ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
  •  ముండా కాదు ముత్తైదువా కాదు
  •  ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
  •  ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
  •  ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
  •  నడమంత్రపు సిరి నరాల మీద పుండు
  •  నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
  •  నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
  •  నవ్వు నాలుగు విధాలా చేటు
  •  నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
  •  నిదానమే ప్రధానము
  •  నిజం నిప్పు లాంటిది
  •  నిమ్మకు నీరెత్తినట్లు
  •  నిండు కుండ తొణకదు
  •  నిప్పు ముట్టనిది చేయి కాలదు
  •  నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
  •  నూరు గుర్రాలకు అధికారి ఐనా భార్యకు యెండు పూరి
  • నెల్లాళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
  •  ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
  •  ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
  • బతికి ఉంటే బలుసాకు తినవచ్చు 
  •  ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
  •  ఊరు మొహం గోడలు చెపుతాయి
  •  పాకి దానితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
  •  పాము కాళ్ళు పామునకెరుక
  •  పానకంలో పుడక
  •  పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
  •  పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు
  •  పండిత పుత్రః శుంఠ
  •  పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
  •  పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
  •  పట్టి పట్టి పంగనామం పెడితే గోడ చాటుకు వెళ్ళి చెరిపి వేసుకున్నాడట
  • పెదిమ దాటితే పృథివి దాటును
  •  పెళ్ళంటే నూరేళ్ళ పంట
  •  పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
  •  పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట
  •  పెరుగు తోట కూరలో పెరుగు యెంత  ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
  •  పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
  •  పిచ్చోడి చేతిలో రాయిలా
  •  పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
  •  పిల్లికి చెలగాటం యెలుకకు ప్రాణ సంకటం
  •  పిండి కొద్దీ రొట్టె
  •  పిట్ట కొంచెము కూత ఘనము
  •  పోరు నష్టము పొందు లాభము
  •  పోరాని చోట్లకు పోతే రారాని మాటలు రాకపోవు
  •  పొర్లించి పొర్లించి కొట్టిన మీసాలకు మన్ను కాలేదన్నదట
  •  పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
  •  పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
  •  రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
  •  రామాయణంలో పిడకల వేట
  •  రమాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
  • రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
  •  రెడ్డి వచ్చే మొదలు పెట్టు అన్నట్టు
  •  రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
  •  రౌతు కొద్దీ గుర్రము
  •  ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
  •  చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
  •  సంతొషమే సగం బలం
  •  సిగ్గు విడిస్తే శ్రీరంగమే
  •  సింగడు అద్దంకి పోనూ పొయ్యాడు రానూ వచ్చాడు
  •  శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు
  •  శుభం పలకరా యెంకన్నా అంటే పెళ్ళి కూతురు ముండ ఎక్కడ అన్నాడంట!
  •  శ్వాస ఉండేవరకు ఆశ ఉంటుంది
  •  తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందట
  •  తాడి తన్ను వాని తల తన్నేవాడు ఉంటాడు 
  •  తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు
  •  తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు
  •  తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదురుతాయా
  •  తాతకు దగ్గులు నేర్పినట్టు
  •  తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లూ కుట్టిందట
  •  తన కోపమే తన శత్రువు
  •  తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము
  •  తంతే గారెల బుట్టలో పడ్డట్లు
  •  తప్పులు వెదికే వాడు తండ్రి ఒప్పులు వెదికేవాడు వోర్వలేనివాడు
  •  తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు
  •  తెగేదాక లాగవద్దు
  •  తిక్కలోడు తిరణాళ్ళకు వెలితే ఎక్కా దిగా సరిపొయిందంట
  •  తినే ముందు రుచి అడుగకు వినే ముందు కథ అడుగకు
  •  తినగా తినగా గారెలు చేదు
  •  తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి
  •  తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెటీగ కుట్టేది
  •  ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు
  •  ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు
  •  ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు
  •  ఉత్తికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్టు 
  •  వాపును చూసి బలము అనుకున్నాడట
  •  వీపుమీద కొట్టవచ్చు కాని కడుపు మీద కొట్టరాదు
  •  వెర్రి వెయ్యి విధాలు
  •  వినాశకాలే విపరీత బుద్ధి
  •  యే ఎండకు ఆ గొడుగు
  •  యే గాలికి ఆ చాప
  •  యెద్దు పుండు కాకికి ముద్దు
  •  యేకులు పెడితే బుట్టలు చిరుగునా
  •  యెక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు
  •  యెప్పుడూ ఆడంబరంగా పలికే వాడు అల్పుడు
  •  

 

Contact Form

Name

Email *

Message *

Whatsapp Button works on Mobile Device only