Telugu Padyaalu Dasarathi Satakam History Dasarathi Satakam Lyrics In Telugu Images

Dasarathi Satakam PDF Download,Dasarathi Satakam pdf in Telugu Download,Telugu Padyaalu Dasarathi Satakam History Dasarathi Satakam Lyrics In Telugu Inspirational Dasarathi Satakam Poems In Telugu,Dasarathi Satakam in telugu,Dasarathi poems lyrics,Dasarathi Satakam lyrics,Dasarathi Satakam padyaalu in telugu with lyrics,Dasarathi Satakam padyaalu meaning with lord Rama hd wallpapers in telugu

అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యు స
ద్ద్విజ్జముని కోటికెల్లఁ గులదేవతయ్యు దినేశ వంశ భూ
భుజులకు మేటివయ్యు బరిపూర్ణుడవై వెలుగొందు పక్షి రా
డ్ఢ్వజ మిముఁ బ్రస్తుతించెదను దాశరథీ! కరుణాపయోనిధీ!
2
అల్లన లింగమంత్రిసుతుఁ డత్రిజగోత్రజుఁ డాదిశాఖ కం
చెర్ల కులోద్భవుండన బ్రసిద్ధుడనై భవదంకితంబుగా
నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ! కరుణాపయోనిధీ!
3
ఇరువదియొక్క మారు ధరణీశులనెల్ల వధించి, తత్కళే
బర రుధిర ప్రవాహమునఁ బైతృకతర్పణ మొప్పఁజేసి, భూ
సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణి నొసంగితీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ!
4
కరమనురక్తి మందరము గవ్వముగా, నహిరాజు త్రాడుగా
దొరకొని దేవదానవులు దుగ్ధపయోధి మథించుచున్నచో
ధరణి చలింప, లోకములు తల్లడమందగఁ, గూర్మమై ధరా
ధరము ధరించితీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ!
5
కలియుగ మర్త్యకోటి నిను గన్ గొనరాని విధంబొ భక్తవ
త్సలత వహింపవో చటుల సాంద్ర విపద్దశవార్ధిఁ గ్రుంకుచో
బిలచిన బల్క వింత మరపే నరు లిట్లనరాదుగాక  నీ
తలపున లేదె సీతచెర దాశరథీ! కరుణాపయోనిధీ!
6
కుక్షి నజాండపంక్తు లొనగూర్చి చరాచర జంతుకోటి సం
రక్షణ చేయు తండ్రివి, పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవు గావలదె? పాపములెన్ని యొనర్చినన్, జగ
ద్రక్షక కర్త నీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ!
7
గురుతరమైన కావ్యరస గుంభన కబ్బుర మంది ముష్కరుల్
సరసుల మాడ్కి సంతసిల జాలుదు రోటు శశాంకచంద్రికాం
కురముల కిందుకాంతమణి కోటి స్రవించిన భంగి వింధ్య భూ
ధరమున జారునే శిలలు దాశరథీ! కరుణాపయోనిధీ!
8
చరణము సోకినట్టి శిల జవ్వని రూపగు టొక్కవింత, సు
స్థిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింత గాని, మీ
స్మరణ దనర్చు మానవులు సద్గతి జెందిన దెంతవింత యీ
ధరను? ధరాత్మజారమణ దాశరథీ! కరుణాపయోనిధీ!
9
చిరతర భక్తి నొక్క తులసీదళ మర్పణ సేయువాడు ఖే
చర గరు డోరగ ప్రముఖసంఘములో వెలుగన్ సదా భవత్
స్ఫురదరవింద పాదములఁ బూజ లొనర్చినవారి కెల్లఁ ద
త్పర మరచేత ధాత్రి గద దాశరథీ! కరుణాపయోనిధీ!
10
జలనిధిలోన దూటి, కులశైలము మీటి, ధరిత్రిఁ గొమ్మునం
దలవడ మాటి, రక్కసుని యంగము గీటి, బలీంద్రునిన్ రసా
తలమున మాటి, పార్థివకదంబము గూల్చిన మేటి రామ నా
తలపున నాటి రాఁగదవె దాశరథీ! కరుణాపయోనిధీ!
11
తప్పు లెరుంగలేక దురితంబులు సేసితినంటి, నీవు మా
యప్పవు గావుమంటి, నిక నన్యులకున్ నుదురంటనంటి, నీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బంటునంటి, నా
తప్పుల కెల్ల నీవె గతి దాశరథీ! కరుణాపయోనిధీ!
12
తరువులు పూచి కాయలగుఁ, దత్కుసుమంబులు పూజగా భవ
చ్చరణము సోకి దాసులకు సారములౌ ధనధాన్యరాసులై
కరి భట ఘోటకాంబర నికాయములై విరజానదీ సము
త్తరణ మొనర్చుఁ జిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!
13
దురమునఁ దాటకం దునిమి, ధూర్జటివిల్ దునుమాడి, సీతనుం
బరిణయమంది, తండ్రి పనుపన్ ఘనకాననభూమికేగి, దు
స్తర పటు చండ కాండకులిశాహతి రావణ కుంభకర్ణ భూ
ధరములఁ గూల్చితీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ!
14
దైవము తల్లిదండ్రి తగు దాత గురుండు సఖుండు నిన్నెకా
భావన సేయుచున్న తరిఁ బాపములెల్ల మనోవికార దు
ర్భావితుఁ జేయుచున్నవి, కృపామతివై నను గావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
15
దీక్ష వహించి నాకొలది దీనుల నెందరిఁ గాచితో జగ
ద్రక్షక తొల్లి యా ద్రుపదరాజతనూజ తలంచినంతనే
యక్షయమైన వల్వ లిడి తక్కట నా మొర చిత్తగించి ప్ర
త్యక్షము గావదేమిటికి? దాశరథీ! కరుణాపయోనిధీ!
16
నీ సతి పెక్కు కల్ములిడ నేర్పరి, లోక మకల్మషంబుగా
నీ సుత సేయు పావనము, నిర్మితికార్య ధురీణదక్షుడై
నీ సుతు డిచ్చు నాయువులు, నిన్ను భజించిన గల్గకుండునే
దాసుల కీప్సితార్థములు, దాశరథి! కరుణాపయోనిధీ!
17
నోచిన దల్లిదండ్రికిఁ దనూభవు డొక్కడె చాలు మేటి, చే
చాచనివాడు, వేరొకడు చాచిన లేదన కిచ్చువాడు, నో
రాచి నిజంబుకాని పలుకాడనివాడు, రణంబులోన మేన్
దాచనివాడు, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!
18
పట్టితి భట్టరార్యగురు పాదము, లిమ్మెయి నూర్ధ్వపుండ్రముల్
బెట్టితి, మంత్రరాజ మొడిఁ బెట్టితి, నయ్యమకింకరాళికిం
గట్టితి బొమ్మ, మీ చరణకంజములందుఁ దలంపు బెట్టి పోఁ
దట్టితి పాపపుంజముల, దాశరథీ! కరుణాపయోనిధీ!
19
పరుల ధనంబుఁ జూచి, పరభామలఁ జూచి హరింపఁగోరు మ
ద్గురుతర మానసంబనెడి దొంగను బట్టి, నిరూఢదాస్య వి
స్ఫురిత వివేకపాశములఁ జుట్టి, భవచ్చరణంబనే మరు
త్తరువున గట్టివేయగదె దాశరథీ! కరుణాపయోనిధీ!
20
మామక పాతకవ్రజము మాన్పనగణ్యము, చిత్రగుప్తులే
మేమని వ్రాతురో? శమనుడేమి విధించునొ? కాలకింకర
స్తోమ మొనర్చుటేమొ? వినజొప్పడ దింతకు మున్నె దీనచిం
తామణి, యెట్లుగాచెదవొ? దాశరథీ! కరుణాపయోనిధీ!    
Dasarathi Satakam PDF Download,Dasarathi Satakam pdf in Telugu Download,Telugu Padyaalu Dasarathi Satakam History Dasarathi Satakam Lyrics In Telugu Inspirational Dasarathi Satakam Poems In Telugu,Dasarathi Satakam in telugu,Dasarathi poems lyrics,Dasarathi Satakam lyrics,Dasarathi Satakam padyaalu in telugu with lyrics,Dasarathi Satakam padyaalu meaning with lord Rama hd wallpapers in telugu
Dasarathi Satakam PDF Download,Dasarathi Satakam pdf in Telugu Download,Telugu Padyaalu Dasarathi Satakam History Dasarathi Satakam Lyrics In Telugu Inspirational Dasarathi Satakam Poems In Telugu,Dasarathi Satakam in telugu,Dasarathi poems lyrics,Dasarathi Satakam lyrics,Dasarathi Satakam padyaalu in telugu with lyrics,Dasarathi Satakam padyaalu meaning with lord Rama hd wallpapers in telugu  

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget